ఎల్ నినో ముప్పు తెలిసినా చంద్రబాబు ఏం చేశారు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Amaravati
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైఎస్‌ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఖరీఫ్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో 51 శాతానికిపైగా వర్షపాతం లోటు నమోదైందని, 688 మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.