టీడీపీ మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవికి వెల్లువెత్తిన తెలగ సంఘం సంపూర్ణ మద్దతు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవనాపు భార్గవి ఉత్తరాంధ్ర తెలగ సంఘం నాయకులు పల్లంట్ల వెంకట రామారావును కలిశారు. సంఘ కార్యాలయానికి వెళ్లిన ఆమె సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆమెను శాలువా మరియు పూల బొకేతో ఘనంగా సన్మానించి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.