హైదరాబాద్‌లో రౌడీషీటర్ మహమ్మద్ నయీమ్ దారుణ హత్య.

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ మహమ్మద్ నయీమ్ దారుణ హత్యకు గురయ్యాడు. సెటిల్‌మెంట్ల డబ్బుల పంపకాల వివాదంలో చిన్ననాటి స్నేహితుడు, మరో రౌడీషీటర్ ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇల్లందుకు చెందిన వీరిద్దరిపై పలు కేసులు ఉన్నాయి. నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.