మహిళా క్రికెట్ జట్టుకు త్వరలోనే ప్రత్యేక టీవ్టీ జట్లు: అమోల్ ముజుందార్
రిపోర్టర్: హరి
స్థలం: Mumbai
భారత మహిళల క్రికెట్ జట్టులో టీవ్టీ ఫార్మాట్ కోసం త్వరలోనే ప్రత్యేకమైన జట్టును ఏర్పాటు చేయనున్నట్లు భారత మహిళా జాతీయ జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ వెల్లడించారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే యువ తరం క్రికెటర్లు ఆధునిక ఆట శైలికి తగినట్లుగా సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. అండర్-15, అండర్-19 క్యాంపులలో అద్భుతమైన ప్రతిభ కనిపిస్తోందని, త్వరలోనే భారత జట్టు అత్యుత్తమ స్థితికి చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.