కంటోన్మెంట్ పేదలపై వేధింపులంటూ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ధ్వజం
రిపోర్టర్: సునీల్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో పేద ప్రజలపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కంటోన్మెంట్లో బడాబాబుల బంగ్లాలకు, తొంబై తొమ్మిది సంవత్సరాల లీజుల పేరుతో కోట్ల సంపాదన గడిస్తున్నవారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిరుపేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. పేదల బతుకులతో చెలగాటమాడుతున్న అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేస్తూ, అణగారిన వర్గాలకు న్యాయం జరిగే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.