అటవీ విస్తీర్ణం 50 శాతానికి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం: నాగబాబు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పార్వతీపురం మన్యం

రాష్ట్రంలో అటవీ ప్రాంతాన్ని 29 నుంచి 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ఏపీ గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి రిజర్వ్‌ అటవీ ప్రాంతంలోని ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.