యువతకు తీపి కబురు: ఉమ్మడి విజయనగరంలో ఉచిత నైపుణ్య శిక్షణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విజయనగరం
ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని యువతకు పలు నైపుణ్య కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఇన్ఛార్జి కార్యనిర్వాహక సంచాలకుడు జి.గోపి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల పదహారో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మహిళలకు ఇజ్రాయెల్లో ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.