ఔరంగజేబ్ సమాధి తొలగింపుపై మహారాష్ట్రలో మరోసారి తీవ్ర వివాదం
రిపోర్టర్: హరి
స్థలం: ముంబై
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి తొలగింపునకు గడువు ఖరారైందని మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే సంచలన ప్రకటన చేశారు. ఛత్రపతి శంభాజీ నగర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సమాధి తొలగింపు తేదీని ఇప్పుడే బహిరంగంగా వెల్లడించబోమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఈ విషయం తెలుసని, సరైన సమయంలో ఆయనే తేదీని ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.