ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం: మాజీ మంత్రి హరీశ్ రావుపై ఎఫ్ఐఆర్

రిపోర్టర్: విజయ్ స్థలం: Siddipet

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసును సిద్దిపేటకు బదిలీ చేయడంతో దర్యాప్తు వేగం పుంజుకుంది. సిద్దిపేట వన్టౌన్ పోలీసులు తాజాగా కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఈ కేసులో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును ఏ1 నిందితుడిగా చేర్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్ లో తీవ్ర కలకలం రేపింది.