అధికారులు లేని గ్రామసభ: జీకే వీధిలో దారకొండ రైతుల ఆందోళన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండలో గ్రామసభ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన సభకు ప్రత్యేక అధికారి సహా పలు శాఖల సిబ్బంది గైర్హాజరు కావడంపై గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత తుపానులో దెబ్బతిన్న పంటలను అధికారులు ఇప్పటివరకు పరిశీలించలేదని మండిపడుతూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.