తెలంగాణలో పేదల కోసం రెండు లక్షల ఇళ్లు కేటాయింపు
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణలోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 2 లక్షల ఇళ్లను కేటాయించింది. ఒక్కో లబ్ధిదారుడికి కేంద్రం తరఫున రూ. 1.20 లక్షల ప్రాథమిక ఆర్థిక సాయం అందనుంది. వివిధ పథకాలతో కలిపి ఈ మొత్తం రూ. 1.80 లక్షల వరకు లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు స్పష్టమవుతోంది.