తెలుగు రాష్ట్రాలకు 3.46 లక్షల ప్రధాని ఆవాస్‌ ఇళ్లు మంజూరు

రిపోర్టర్: సురేష్ స్థలం: దిల్లీ

తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలకు ప్రధాని ఆవాస్‌ యోజన కింద కొత్తగా 3,46,544 ఇళ్లు మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు 2,25,788, తెలంగాణకు 1,20,756 ఇళ్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ దిల్లీలో వెల్లడించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక తెలుగు రాష్ట్రాలకు ఐదు లక్షల ఇళ్లు ఇచ్చినట్లు తెలిపారు. జగన్‌ హయాంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.