ఓటీటీలోకి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రేమకథా చిత్రం: ఈటీవీ విన్ లో బాలు గీత స్ట్రీమింగ్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నుంచి వచ్చిన బాలు గీత చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్ వేదికగా గురువారం నుంచి నేరుగా స్ట్రీమింగ్ అవుతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. కమిటీ కుర్రోళ్లు ఫేమ్ సందీప్ సరోజ్, కేయూరి ప్రధాన పాత్రల్ లో నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకత్వం వహించారు. యువతను ఆకట్టుకునే లవ్, కామెడీ అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు మేకర్స్ తెలిపారు.