ఆర్థిక సంక్షోభం వేళ పాకిస్థాన్‌లో స్మార్ట్ లాక్‌డౌన్ అమల్లోకి

రిపోర్టర్: గోపి స్థలం: పాకిస్థాన్

తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరిగిపోతున్న ఇంధన ధరల కారణంగా పాకిస్థాన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టి ప్రధాని నేతృత్వంలో స్మార్ట్ లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్, మార్కెట్లు రాత్రి 9 గంటలకే మూసివేయాలని, వివాహ వేడుకల్లో కేవలం ఒక్క వంటకం మాత్రమే వడ్డించాలని ఆదేశాలు జారీ చేస్తూ మూడు నెలల పాటు ఈ ఆంక్షలను ప్రకటించింది.