పంజాబ్లో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న భగవంత్ మాన్ ప్రభుత్వం
రిపోర్టర్: సునీల్
స్థలం: పంజాబ్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా యుద్ధ్ నషేన్ విరుద్ పేరుతో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా విస్తృత చర్యలు చేపట్టింది. మార్చి 2025 నుండి సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో భారీగా డ్రైవ్స్ నిర్వహించి వేలాది మందిని అరెస్ట్ చేయడంతో పాటు భారీ ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.