స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ తీవ్ర నిప్పులు: ఇవి ఎలక్షన్స్ కాదు సెలెక్షన్స్ అంటూ ఫైర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ భారీ అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం, పోలీసులు, ఎస్ఈసీ కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని, ఇవి అసలు ఎన్నికలు కావని కేవలం సెలెక్షన్స్ మాత్రమేనని ఎక్స్ వేదికగా జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.