లక్నోలో దారుణం: కారు పార్కింగ్ వివాదంలో ముగ్గురు వ్యక్తుల దుర్మరణం
రిపోర్టర్: సురేష్
స్థలం: Lucknow
లక్నోలోని సాదత్ గంజ్ ప్రాంతంలో కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం రక్తపాతానికి దారితీసిందని, నిందితుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జితేంద్ర శ్రీవాస్తవ వెల్లడించారు. బ్రాహ్మణి టోలా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో శివాజీ తివారీ, శివేంద్ర తివారీ, సుయాష్ తివారీలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు తెలిపారు. నిందితుడు రిషబ్ శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.