'బోయిన్ పల్లిలో జీ+1 షాపింగ్ కాంప్లెక్స్': ఈటల భూమిపూజ

రిపోర్టర్: సునీల్ స్థలం: సికింద్రాబాద్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించ తలపెట్టిన జీ+1 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఈటల రాజేందర్ భూమి పూజ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్. శ్రీ గణేష్ తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మార్కెట్ అభివృద్ధిలో భాగంగా చేపట్టే ఈ నిర్మాణ పనుల ద్వారా స్థానిక వ్యాపారులకు, రైతులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.