వైకాపా ఆత్మీయ సమావేశంలో భావోద్వేగంతో కంటతడి పెట్టిన బొత్స సత్యనారాయణ
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గరివిడిలో జరిగిన వైకాపా ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు పార్టీ వీడి తెదేపాలో చేరడం, పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ పరిణామం వైకాపాకు పెద్ద దెబ్బగా మారింది.