తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు: ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెలువరించిన జీవో ఆర్టీ నంబర్ 1553 ప్రకారం, జయేష్ రంజన్‌ను పర్యావరణ, అటవీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, శైలజా రామయ్యర్, రాహుల్ బొజ్జా సహా పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు.