కాకినాడ జిల్లాలో కంటైనర్ లారీ ఢీకొని ప్రైవేట్ బస్సు బోల్తా
రిపోర్టర్: శివ
స్థలం: కాకినాడ జిల్లా
కాకినాడ జిల్లా తుని మండలం రాజులకొత్తూరు వద్ద ఉప్పాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తునిలో పెళ్లి వేడుక ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.