సుజుకి ఇ యాసెస్ వర్సెస్ యమహా ఈసీ జీరో సిక్స్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో సుజుకి ఇ యాసెస్ మరియు యమహా ఈసీ జీరో సిక్స్ మోడల్స్ సరికొత్త పోటీని ఇస్తున్నాయి. ఈ రెండు జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డిజైన్, పనితీరు మరియు రైడింగ్ అనుభూతి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు తెలిపారు. యమహా ఈసీ జీరో సిక్స్ మోటార్ పనితీరులో ముందంజలో ఉండగా, సుజుకి ఇ యాసెస్ తేలికపాటి బరువుతో రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.