పూణెలో దారుణం: అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య
రిపోర్టర్: కిరణ్
స్థలం: పూణె
పూణె నగరంలోని ముకుంద్ నగర్ లో అత్తింటి వేధింపులు భరించలేక పాయల్ జాంబ్రే పాటిల్ అనే ఇరవై తొమ్మిదో ఏళ్ల వివాహిత బలవన్మరణానికి పాల్పడినట్లు స్వార్గే పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ యశ్వంత్ నికమ్ తెలిపారు. అదనపు కట్నం కోసం అత్తమామలు, భర్త తనను నిత్యం వేధించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.