ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం
ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె ధైర్యసాహసాలు, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాట స్ఫూర్తిని అధికారులు కొనియాడారు.