అద్దంకిలో రూ.7.72 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం
రిపోర్టర్: నరేష్
స్థలం: అనకాపల్లి
అద్దంకి ఎన్ఎస్పీ కాలనీలో రూ.7.72 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించడం జరిగింది. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడం ద్వారా అద్దంకి ప్రాంతంలో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా మారుతుందని, విద్యుత్ అంతరాయాల సమస్య పూర్తిగా తగ్గుతుందని అధికారులు తెలిపారు. అద్దంకి ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించే దిశగా ఇది మరో కీలక ముందడుగు అని పేర్కొన్నారు.