ఖమ్మంలో గోద్రెజ్ ప్లాంట్లో మురుగునీటి ట్యాంకు లీకేజీ కలకలం
రిపోర్టర్: రమేష్
స్థలం: Khammam
ఖమ్మం జిల్లా అంజనాపురం గ్రామంలోని గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్లో మురుగునీటి ట్యాంకు లీకైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు ముప్పై వేల లీటర్ల సామర్థ్యం గల వ్యర్థ జలాల ట్యాంకు ప్రభావితం కావడంతో మురుగు బయటకు వచ్చి భూముల్లోకి వ్యాపించిందని గ్రామస్థులు తెలిపారు. పరిస్థితి విషమించకుండా ఫ్యాక్టరీ సిబ్బంది జేసీబీల సహాయంతో అడ్డుకునే ప్రయత్నం చేశారని, ప్లాంట్ వెలుపలి వాతావరణంపై ఎలాంటి ప్రభావం పడలేదని యాజమాన్యం స్పష్టం చేసిందని అధికారులు పేర్కొన్నారు.