భారత వైద్య రంగానికి బ్రిటన్ దంపతుల జై: లక్నోలో ఐవీఎఫ్ చికిత్స

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: లక్నో

భారతదేశ ఆరోగ్య రంగం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని బ్రిటన్కు చెందిన డేవ్ ఫ్లూ వెల్లడించారు. సంతానోత్పత్తి సమస్యలతో సతమతమవుతున్న తాము లక్నోలోని ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. బ్రిటన్తో పోలిస్తే ఇక్కడ వైద్య పరీక్షల ఫలితాలు నిమిషాల వ్యవధిలోనే రావడం, ఖర్చులు అత్యంత తక్కువగా ఉండటం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి అద్భుతమైన వైద్య సదుపాయాలు చూసి మురిసిపోయినట్లు స్పష్టం చేశారు.