వెండితెరపైకి రీఎంట్రీ: శ్రీమతి చిత్రంతో రానున్న నటి నివేదా థామస్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

నటనకు రెండేండ్ల విరామం ప్రకటించిన ప్రముఖ నటి నివేదా థామస్ తాజాగా మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న శ్రీమతి ఫ్యామిలీ డ్రామా చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ కొత్త ప్రయాణం పట్ల తనకు ఎంతో ఉత్సాహంగా ఉందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని ఆమె పేర్కొన్నారు.