లక్షెట్టిపేటలో శనివారం మండల స్థాయి సమస్యలపై కీలక సమీక్ష
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: లక్సెట్టిపేట
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని స్థానిక ఎంపీడీవో మధుసూదన్ తెలిపారు. శనివారం ఉదయం పది గంటలకు లక్షేట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి సమావేశం ఉంటుందని ఆయన వెల్లడించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారాలు, శాఖల ప్రగతిపై సమీక్ష ఉంటుందన్నారు. ఈ సమావేశానికి సర్పంచులు, అధికారులు సకాలంలో తప్పకుండా హాజరు కావాలని ఆయన కోరారు.