రైతన్నలకు తీపి కబురు: ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేంద్రం

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

రైతులకు సాగు ఖర్చులు తగ్గించి, నేల సారాన్ని పెంపొందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఖేత్ బచావో అభియాన్ రబీ 2026 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కేంద్ర అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా యాభై లక్షల మంది రైతులకు ఈ పథకాన్ని చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా ఎరువుల సమతుల్య వినియోగం, సహజ వ్యవసాయంపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.