భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి జీవో జారీ చేసిన ప్రభుత్వం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

పెండింగ్ లో ఉన్న అసైన్డ్, చుక్కల, ఇనాం భూముల దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం జీవో 659 జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఆర్డీవో అలాగే తహసీల్దార్ పరిధిలోని దరఖాస్తులను అరవై రోజుల్లోగా క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆన్లైన్ దరఖాస్తులు నేరుగా తహసీల్దార్ లాగిన్ కు చేరేలా సాంకేతిక మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో లక్షలాది మందికి పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు దక్కుతాయని అధికారులు స్పష్టం చేశారు.