హర్యానా గాయకుడు దిలేర్ ఖర్కియా కారుపై కాల్పుల కలకలం
రిపోర్టర్: రమేష్
స్థలం: చండీగఢ్
హర్యానాకు చెందిన ప్రముఖ గాయకుడు దిలేర్ ఖర్కియా ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారుపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. సోషల్ మీడియా వేదికగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఈ దాడికి బాధ్యత వహిస్తూ కొందరు పోస్టులు పెట్టడం కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.