ఆటోమొబైల్ రంగానికి గుడ్ న్యూస్: మార్కెట్లోకి కొత్త బైక్ ల రాక

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

ఆటోమొబైల్ రంగంలో సరికొత్త మోడళ్లతో వాహనదారులకు మెరుగైన ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయని ఆటోమోటివ్ నిపుణులు తెలిపారు. హార్లే డేవిడ్సన్, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ వంటి ప్రముఖ కంపెనీలు సరికొత్త ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్లతో రాబోయే రోజుల్ లో పలు టూవీలర్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. పెట్రోల్ ధరల భారం తట్టుకునేలా, ఆధునిక సాంకేతికతతో తక్కువ ఖర్చులో అత్యుత్తమ పనితీరు అందించే బైక్ లపై ఆటో కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు మార్కెట్ వర్గాలు స్పష్టం చేశాయి.