మేడారంలో వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తాడ్వాయి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, బంగారంగా భావించే బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని తన్మయత్వం చెందుతున్నారు. భక్తుల రాకతో మేడారం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.