భారతీయుడు 3 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని లైకా ప్రొడక్షన్స్ వెల్లడి
రిపోర్టర్: కిరణ్
స్థలం: చెన్నై
కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న 'భారతీయుడు 3' చిత్రానికి సంబంధించిన మిగతా భాగాన్ని పూర్తి చేసేందుకు త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తయిందని, ఎడిటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపింది. లంచగొండితనాన్ని అంతమొందించేందుకు సేనాపతి చేసే పోరాటం బిగ్ స్క్రీన్‌పై చూడాలని సంస్థ అధినేత సుభాస్కర్ పేర్కొన్నారు.