తలసాని శ్రీనివాస్‌ను కలిసిన ఏఐఎస్ఎఫ్ నేత: శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న వైనం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాళహస్తి
తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్నేహపూర్వక చర్చ జరిగింది. అనంతరం శ్రీకాళహస్తికి విచ్చేసిన ఆయన, జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు.