పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వెబ్సైట్ సమస్యలపై తీవ్ర ఆందోళన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కేసముద్రం

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వెబ్సైట్ పనిచేయకపోవడంతో అర్హులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పట్టభద్రులు తెలిపారు. నవంబర్ 6 చివరి తేదీ కావడంతో దరఖాస్తు చేసుకోలేక విద్యావంతులు అయోమయానికి గురవుతున్నారని వెల్లడించారు. సాంకేతిక లోపాలను వెంటనే పరిష్కరించి గడువు పొడిగించాలని లేదా ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించాలని బాధితులు కోరుతున్నట్లు పేర్కొన్నారు.