వనపర్తిలో ఘనంగా వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ అవగాహన సదస్సు
రిపోర్టర్: వెంకట్
స్థలం: వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును వనపర్తి కలెక్టర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతను ఉపయోగించుకోవడంపై రైతులకు అధికారులు పలు కీలక సూచనలు చేశారు.