పీఎఫ్ చందాదారులకు తీపి కబురు: వాట్సాప్ ద్వారానే బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
పీఎఫ్ చందాదారులకు వాట్సాప్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకునే నూతన సేవలను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారని అధికారులు తెలిపారు. ఈపీఎఫ్ఓ తీసుకువచ్చిన ఈ అధికారిక డిజిటల్ సేవతో చందాదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. అలాగే కేవైసీ పూర్తయిన నిలిచిపోయిన ఖాతాల్ లో రూ. వెయ్యి లోపు ఉన్న మొత్తాన్ని ఆటోమేటిక్గా జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు లక్ష ఖాతాల నిధులు ఉద్యోగులకు నేరుగా చేరతాయని అధికారులు వివరించారు.