మెగాస్టార్ చిరంజీవి కాకా చిత్రంలోకి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

మెగాస్టార్ చిరంజీవి మరియు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కాకా చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారని చిత్ర బృందం వెల్లడించింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.