స్ఫూర్తిదాయకం: అసాధారణ ప్రజ్ఞతో అమెజాన్ లో ఉద్యోగం సాధించిన సాయి భరత్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Warangal

పుట్టుకతో ఎడమచేయి లేకపోయినా పట్టుదలతో రాణించి అమెజాన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఎంపికయ్యారని ఎన్ఐటీ వరంగల్ గ్రాడ్యుయేట్ సాయి భరత్ గురించి సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. వరంగల్ లోని ప్రఖ్యాత ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన ఆయన, అమెజాన్ పే విభాగంలో ఎస్ డీఈ-2 గా పనిచేస్తూ ఏడాదికి యాభై లక్షలకు పైగా వేతనం అందుకుంటున్నారని ఆ పోస్టులో పేర్కొన్నారు.