పిచ్చాటూరు మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రిపోర్టర్: Balaji స్థలం: పిచ్చాటూరు

తిరుపతి జిల్లాలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని హనుమంతపురం గ్రామానికి చెందిన దాసు బాలాజీ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. కాలువలు, చెరువుల వద్దకు ఎవరూ వెళ్లకూడదని, వాతావరణ హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.