యువతకు మానసిక ఆరోగ్యం ముఖ్యం: వైద్య నిపుణుల సలహాలతో ప్రత్యేక అవగాహన
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్వర్ణ నంది అవార్డు గ్రహీత మాచర్ల శివశంకర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం వైద్యాధికారి కేశగాని రాజేష్ గౌడ్, ఎర్రగడ్డ మానసిక వైద్య నిపుణులను కలిసి చికిత్సా వివరాలు తెలుసుకున్నారు. యువత, ఉద్యోగులు, విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉంటూ సానుకూల ఆలోచనలు పెంపొందించుకోవాలని, మానసిక సమస్యలున్నవారు క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు.