మహాకవి గురజాడ అప్పారావు జయంతి ఘన నివాళులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Andhra Pradesh

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ జాతికి చైతన్యం నూరిపోసిన మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. నవయుగ వైతాళికుడిగా గురజాడ అందించిన సాహితీ సేవలను, సాస్కిత్క చైతన్యాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా స్మరించుకున్నారు.