ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రెండు లక్షలు వసూలు చేసిన మోసగాడు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రభుత్వ, ఐటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రెండు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరుకు చెందిన దీపక్ వర్మను నిందితుడు శివసాయి హరీశ్ రాజు ఉద్యోగం పేరుతో మోసగించాడని, విద్యుత్ సౌధలో జేఏవోనని పరిచయం చేసుకుని డబ్బులు కాజేశాడని బాధితుడు ఫిర్యాదు చేశాడని పోలీసులు స్పష్టం చేశారు.