విజయనగరం ఆదిత్య కళాశాలలో గూగుల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

విజయనగరం ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఐసీటీ అకాడమీ సహకారంతో గూగుల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభమైంది. 25 రోజుల పాటు సాగే ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా విద్యార్థినులకు సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ నైపుణ్యాలను నేర్పించి, గూగుల్ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందేలా సిద్ధం చేస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్. శేషారెడ్డి సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.