స్పీకర్ దూషణ కేసు: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్పీకర్‌ను అవమానించడం సభ గౌరవానికి సంబంధించిన అంశమని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో తెల్లవారుజామునే ఈ అరెస్టులు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపింది.