స్థానిక సంస్థల ఎన్నికల బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కీలక విచారణ
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై గురువారం హైకోర్టులో కీలక విచారణ జరగనుందని న్యాయ నిపుణులు తెలిపారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుందని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ల పరిమితి యాభై శాత దాటరాదనే నిబంధన ఉందని, ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొందని స్పష్టం చేశారు.