మహిళలు బాలికల రక్షణ కోసం శక్తి యాప్

రిపోర్టర్: రాము స్థలం: మార్కాపురం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలు మరియు బాలికల భద్రతపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ ఇన్‌స్టాలేషన్‌పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై కూడా విద్యార్థినులకు వివరించారు. అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయాన్ని తక్షణమే వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.