స్టార్లు అయినా చట్టం ముందు సమానమే అంటున్న మహారాష్ట్ర ఎఫ్‌డీఏ

రిపోర్టర్: రాజేష్ స్థలం: మహారాష్ట్ర

విమల్ ఏలాయిచి ప్రకటనలో నటించిన ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లపై నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తప్పవని మహారాష్ట్ర ఆహార మరియుషధ నియంత్రణ మండలి ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారామ్ ముండే స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిషేధిత పాన్ మసాలా సర్రోగేట్ ప్రకటనల ప్రచారంపై నోటీసులు జారీ చేయగా, గడువులోగా స్పందించని ఒక నటుడిపై ఇప్పటికే విచారణ మరియు ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.